Live-in Relationship | లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆ సంబంధాన్ని వివాహంగా గుర్తించలేమంటూ..!
Live-in Relationship | లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సంబంధాన్ని వివాహంగా గుర్తించలేమని స్పష్టం చేసింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ను వివాహంగా గుర్తించే చట్టమేమీ చేయలేదని, రెండు పార్టీలు ఒక ఒప్పందం ఆధారంగా మాత్రమే కలిసి జీవిస్తే వివాహచట్టం పరిధిలోకి వస్తారని అర్థం కాదని కోర్టు పేర్కొంది.
Live-in Relationship | లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సంబంధాన్ని వివాహంగా గుర్తించలేమని స్పష్టం చేసింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ను వివాహంగా గుర్తించే చట్టమేమీ చేయలేదని, రెండు పార్టీలు ఒక ఒప్పందం ఆధారంగా మాత్రమే కలిసి జీవిస్తే వివాహచట్టం పరిధిలోకి వస్తారని అర్థం కాదని కోర్టు పేర్కొంది.
అలాంటి జంటలు సహజీవనం చేయడం పెళ్లితో సమానం కాదని, అందులో విడాకులు కోరలేని జస్టిస్ ముహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సోఫీ థామస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ చెప్పింది. లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌కు చట్టబద్ధమైన గుర్తింపు లేదని, వ్యక్తిగత చట్టం ప్రకారం లేదా లౌకిక చట్టం ప్రకారం ప్రత్యేక వివాహ చట్టం అమలు చేసినప్పుడు మాత్రమే వివాహం సంబంధాన్ని చట్టం గుర్తిస్తుందని తెలిపింది. కేరళకు చెందిన జంట 2006లో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇందులో ఒకరు హిందువు కాగా.. మరొకరు క్రిస్టియన్. రిలేషన్షిప్లో ఉన్న సమయంలో ఇద్దరికి ఓ బిడ్డ సైతం జన్మించింది.
తాజాగా ఈ జంట తమ బంధానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇద్దరికి విడాకులు ఇవ్వలేమని ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది. ఇద్దరు ఏ చట్టం ప్రకారం వివాహం చేసుకోలేదని, దాంతో విడాకులు ఇవ్వడం కుదరని స్పష్టం చేసింది. ఇద్దరు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం విడాకులు ఇవ్వలేమని తెలిపింది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో జీవించే వారికి అలాంటి గుర్తింపు ఏమీ ఉండదని చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mobile Blast | క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో రోగుల పరుగులు.. Video
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

