తిరువనంతపురం: మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు, మహిళా నటుల పట్ల వేధింపులు జరుగుతున్నట్లు ఇటీవల హేమా కమిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ కమిటీ రిపోర్టు నేపథ్యంలో నమోదు అయిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు మహిళా జడ్జీలతో కూడిన ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. మహిళా జడ్జీలతో కూడిన బెంచ్.. పిల్స్‌ను విచారించనున్నది. తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఏ మొహమ్మద్ ముస్తాక్, జస్టిస్ ఎస్ మనులతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఇవాళ ఓ పిటీషన్‌పై విచారణ చేపట్టింది. మహిళా జడ్జీలతో ఏర్పడే బెంచ్‌లో జస్టిస్ ఏకే జయశంకరన్ నంబిర్, జస్టిస్ సీఎస్ సుధా ఉంటారని కోర్టు చెప్పింది. ఆ కమిటీకి చెందిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది. లైంగిక వేధింపుల కేసులను ఈ కమిటీ విచారిస్తుందా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. హేమా కమిటీ రిపోర్టును సవాల్ చేస్తూ నిర్మాత సాజిమోన్ పరాయిల్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.