తిరువనంతపురం: భర్త నిర్దేశిత వయసును దాటినప్పటికీ దాత బీజకణంను ఉపయోగించి ఐవీఎఫ్ చేయించుకోవడానికి భార్య అర్హురాలేనని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. సహాయ పునరుత్పత్తి సాంకేతికత(ఆర్ట్) చట్టం 2021 కింద నిర్దేశించిన 55 ఏండ్ల వయోపరిమితిని భర్త అధిగమించినప్పటికీ ఆమె ఐవీఎఫ్ చేయించుకోవచ్చునని, అయితే దానికి ఆమె భర్త సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
కేసు వివరాల్లోకి వెళితే 46 ఏండ్ల మహిళ, 57 ఏండ్ల ఆమె భర్త గతంలో సంతానం కోసం ఐవీఎఫ్ చికిత్స తీసుకుని విఫలమై మరోసారి ఆ విధానం ప్రయత్నిద్దామని ఒక హాస్పిటల్కు వెళ్లారు. అయితే భర్త వయసు 57 ఏండ్లు దాటినందున ఆర్ట్ చట్టం ప్రకారం వారు ఐవీఎఫ్ చికిత్సకు అనర్హులని తిరస్కరించారు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.