తిరువనంతపురం : యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ)ల నియామకంలో ముఖ్యమంత్రి పాత్రను సవాల్ చేస్తూ కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏపీజే అబ్దుల్ కలామ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కేరళ డిజిటల్ యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా కూడా ఉన్న గవర్నర్ ఈ రెండు రాష్ట్ర యూనివర్సిటీలలో వీసీలను నియమించే ప్రక్రియలో ముఖ్యమంత్రికి స్థానం కల్పించ రాదని కోరుతూ సుప్రీంకోర్టు కెక్కారు.
అంతేగాక, వీసీల నియామకంలో ముఖ్యమంత్రి పాత్ర ఉంటుందన్న ఆగస్టు 18 నాటి సుప్రీం తీర్పును సమీక్షించాలని పిటిషన్ కోరింది.