తిరువనంతపురం : మధ్యాహ్న డైలీ మలయాళ పత్రిక విలేకరైన అశోకన్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడానికి కేరళ పోలీసులు చేసిన ప్రయత్నాన్ని రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ బుధవారం ఐక్యంగా ఖండించారు. అశోకన్‌కు వారంతా బాసటగా నిలిచారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి 65 లక్షల దరఖాస్తుల డాటాను హ్యాకర్లు డార్క్ వెబ్‌లో ఉంచినట్టు అశోకన్ వార్తను బయటపెట్టారు. దీంతో ఈ సమాచారం ఎలా తెలిసిందో వెల్లడించాలంటూ అశోకన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పోలీసులు యత్నించడం సంచలనంగా మారింది.