Kerala Girl Missing : కర్ణాటక (Karnataka) కొండల్లో ట్రెక్కింగ్ (Trecking) కు వెళ్లి కేరళ (Kerala) కు చెందిన మరో బాలిక మిస్సయ్యింది. ఈ ఘటన సంచలనంగా మారింది. ఇటీవలే కేరళకు చెందిన ఓ టెకీ కర్ణాటక కొండల్లో ట్రెక్కింగ్‌కి వెళ్లి తప్పిపోయింది. అనంతరం పోలీసులు గాలింపులు చేపట్టడంతో నాలుగు రోజుల తర్వాత ఆమె ఆచూకీ దొరికింది. అయితే మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేరళలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక పదోతరగతి చదువుతున్నది. కర్ణాటకలోని చంద్రద్రోణ హిల్స్ పైకి ఏప్రిల్ 7న దాదాపు 40 మంది కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. అదేరోజు సాయంత్రం తమ బృందం నుంచి ఆ బాలిక దారి తప్పిపోయింది. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే బాలిక కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కొండలపై తాళ్ల సాయంతో వెతికారు. రాత్రి వేళల్లో డ్రోన్లతోనూ ఆమె కదలికలను గుర్తించేందుకు ప్రయత్నించారు.
కర్ణాటక పోలీసులతోపాటు కేరళ పోలీసులు కూడా ఈ కేసు దర్యాప్తు చేశారు. కాగా కేరళకు చెందిన శరణ్య అనే యువతి కూడా ఏప్రిల్ 2న కర్ణాటకలో ట్రెక్కింగ్‌కు వెళ్లి తప్పిపోయింది. కర్ణాటక ప్రభుత్వం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టి ఎట్టకేలకు నాలుగు రోజుల తర్వాత ఆమె ఆచూకీ దొరకబట్టింది.