కొల్లాం: కేరళ గవర్నర్(Kerala Govenor) ఆరిఫ్ ఖాన్ రెండు రోజుల క్రితం కోజికోడ్‌లోని ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్లారు. చాలా బిజీగా ఉండే వీధిలో ఆయన పబ్లిక్‌తో నేరుగా మాట్లాడుతూ వాకింగ్ చేశారు. ఈ ఘటనపై సీఎం విజయన్ స్పందించారు. నవ కేరళ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కోజికోడ్‌లోని ఎస్ఎం వీధిలో గవర్నర్ ఆరిఫ్ నడుచుకుంటూ వెళ్లిన తీరును సీఎం విజయన్ ఖండించారు. ముందస్తు సమాచారం లేకుండా ఆయన వాకింగ్ చేశారని, భద్రతను కూడా గవర్నర్ విస్మరించడాన్ని విజయన్ తప్పుపట్టారు. కీలక పదువుల్లో ఉన్న వ్యక్తులు నడుచుకుంటూ వెళ్లడం సరికాదని సీఎం అన్నారు. ఉన్నద పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం సరైన విధానం కాదన్నారు. రక్షణ వద్దని గవర్నర్ ఆరిఫ్ రాష్ట్ర పోలీసులకు లేఖ రాసినా.. ఆయనకు మాత్రం జెడ్ ప్లస్ సెక్యూర్టీని కల్పించనున్నట్లు సీఎం విజయన్ తెలిపారు. వీధుల్లో వాకింగ్ చేసి.. కేరళ సురక్షితంగా ఉందని గవర్నర్ చాటారని, కానీ శాంతి భద్రతల గురించి ఈ విధంగా ప్రచారం చేయడం సరికాదు అన్నారు.
#WATCH | Kerala Governor Arif Mohammad Khan visits & interacts with people at the Mittayi Theruvu – SM Street in Kozhikode. pic.twitter.com/aAtPxbw2Pa
— ANI (@ANI) December 18, 2023