CM Kejriwal | న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తన అధికార నివాసం మరమ్మతుల కోసం అంచనా కంటే మూడు రెట్లు అధిక వ్యయం చేసినట్టు కాగ్ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నంబర్ 6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగళాలో నివసించినపుడు దాని మరమ్మతుల కోసం ప్రాథమిక అంచనా వ్యయం రూ. 7.91 కోట్లుగా నిర్ణయించగా 2020లో రూ.8.62 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చారు.
2022లో పీడబ్ల్యూడి శాఖ పనులు పూర్తి చేసే నాటికి మూడు రెట్లు పెరిగి మొత్తం ఖర్చు రూ.33.66 కోట్లకు చేరుకుంది. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అంశంపై బీజేపీ, ఆప్ మధ్య మాటలయుద్ధం నడుస్తున్నది.