ప్రధాని మోదీ జర్మనీ పర్యటన సందర్భంగా ఓ బాలుడు దేశభక్తి గీతం పాడుతూ మోదీకి స్వాగతం పలికాడు. ఆ బాలుడు పాడిన పాటకు మోదీ మెచ్చుకుంటూ, చిటికెలు కూడా వేస్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆ వీడియోను ఎడిట్ చేస్తూ కమెడియన్ కునాల్ కర్మ మరో పాట కట్టాడు. దీనిపై ఆ బాలుడి తండ్రి గణేశ్ పోల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ బాలుడు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ దేశభక్తి గీతం పాడిన వీడియోను కునాల్ కర్మ షేర్ చేశారు. అయితే.. ఆ బాలుడు పాడిన దేశభక్తి గేయానికి బదులుగా.. నిత్యావసర ధరలు పెరుగుతన్నాయంటూ ఓ పాట కట్టి, ఆ వీడియోకు కునాల్ కర్మ జత చేశారు. దీనిపై ఆ బాలుడి తండ్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ బాలుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దని కునాల్ కర్మకు సూచించారు.
He is my 7 year old son, who wanted to sing this song for his beloved Motherland . Though he is still very young but certainly he loves his country more than you Mr. Kamra or Kachra watever u are
Keep the poor boy out of your filthy politics & try to work on your poor jokes https://t.co/ECnBFSIWkI
— GANESH POL (@polganesh) May 4, 2022
బాలుడి తండ్రి కునాల్ కర్మను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ఈ పిల్లవాడు నా పిల్లవాడే. ప్రస్తుతం 7 ఏళ్ల వయస్సు. దేశంపై ఓ పాట పాడాడు. ఆ పిల్లవాడి వయస్సు చిన్నదే అయినా.. నీ కంటే ఎక్కువ దేశభక్తే వుంది. మీ కంటే ఎక్కువే దేశాన్ని ప్రేమిస్తాడు. రాజకీయాల నుంచి ఈ పిల్లవాడ్ని దూరంగా ఉంచండి. మీ సిల్లీ జోకుల పై పని చూసుకోండి అంటూ గణేశ్ పోల్ ఘాటుగా విమర్శలు చేశారు.