అహ్మదాబాద్, ఏప్రిల్ 12: గుజరాత్‌కు చెందిన ప్రముఖ కథక్ నాట్య కళాకారిణి, నృత్య దర్శకురాలు కుముదిని లాఖియా(95) శనివారం అహ్మదాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్నారు. కథక్ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కుముదినీ నాట్య రంగానికి అందచేసిన సేవలకు గుర్తింపుగా ఈ సంవత్సరం కేంద్రం ఆమెకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందించింది. 1964లో ఆమె నృత్య, సంగీత శిక్షణ కోసం కదంబర్ సెంటర్‌ను స్థాపించారు. హిందీ చిత్రం ఉమ్రావ్ జాన్(1981)కు ఆమె కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. కుముదినీ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.