న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రఘాతుకాన్ని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. అయితే జమ్మూకశ్మీర్లోని వార్తాపత్రికలు.. ఇవాళ తమ ఫ్రంట్ పేజీలను నల్లరంగుతో ప్రింట్ చేశాయి. చాలా శక్తివంతమైన రీతిలో ఆ పత్రికలు తమ నిరసన వ్యక్తం చేశాయి. బైసరాన్ లో జరిగిన కాల్పుల్లో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
కశ్మీర్లో ప్రచురించే అన్ని పత్రికా ఆఫీసులు ఏకకంఠంతో ఉగ్రదాడిని ఖండించాయి. ఇంగ్లీష్, ఉర్దూ డెయిలీ పత్రికలు బ్లాక్ కలర్ ఫ్రంట్ పేజీలను పబ్లిష్ చేశాయి. గ్రేటర్ కశ్మీర్, రైజింగ్ కశ్మీర్, కశ్మీర్ ఉజ్మా, అఫ్తాబ్, తమీల్ ఇస్రాడ్ పత్రికలు.. సాంప్రదాయానికి వ్యతిరేకంగా లే అవుట్లను ప్రచురించాయి. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో వార్తలను పబ్లిష్ చేశాయి. ఇక ఎడిటోరియల్స్ను తెలుపు, ఎరుపు రంగులో ప్రచురించారు.