న్యూఢిల్లీ, అక్టోబర్ 22 : లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే రూ.1.11 కోట్ల పారితోషికం ఇస్తానని క్షత్రియ కర్ణి సేన ఆఫర్ చేసింది. గతేడాది డిసెంబర్లో లారెన్స్ బిష్ణోయ్ ముఠా చేతిలో హత్యకు గురైన ప్రముఖ రాజ్‌పుత్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ గొగమెది చావుకు ప్రతీకారంగా ఈ ఆఫర్‌ను ప్రకటించినట్టు కర్ణి సేన నాయకుడు రాజ్ షెకావత్ ప్రకటించారు. బిష్ణోయ్‌ను చంపే ఏ పోలీస్ అధికారికైనా తాను ప్రకటించిన నజరానా అందిస్తానని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి అయింది. గొగమెది హత్య కేసులో ప్రధాన అనుమానితుడితో పాటు మరో ఎనిమిది మందిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.