గురుగ్రామ్: హర్యానా బీజేపీ అధికార ప్రతినిధి, కర్ణిసేన చీఫ్ సూరజ్ పాల్ అము గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేంద్రమంత్రి రూపాలాకు టికెట్ ఇవ్వడంపై అసంతృప్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలను కించపరచే వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి గుజరాత్లో బీజేపీ టికెట్ ఇవ్వడాన్ని యావత్తు క్షత్రియ సమాజాన్ని అవమానించడంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. రాజ్‌కోట్ లోక్‌సభ టికెట్‌ను కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపాలాకు బీజేపీ ఇచ్చింది. రాజ్‌పుత్‌లపై రూపాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వారితో ఒకే కంచంలో తినడంతో పాటు వారికి తమ కూతుళ్లనిచ్చి మహారాజాలు పెండ్లి చేశారని వ్యాఖ్యానించారు.