Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Form-7 objections | కర్ణాటకలో చేపడుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నది. అయితే ఓటర్ల పేర్లు తొలగించాలని కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు అందాయి.
బెంగళూరు: కర్ణాటకలో చేపడుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నది. అయితే ఓటర్ల పేర్లు తొలగించాలని కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు అందాయి. (Form-7 objections) వీటిలో చాలా వరకు తప్పుడు దరఖాస్తులని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఆ దరఖాస్తుదారులపై చర్యలు చేపడతామని వెల్లడించింది. అక్టోబర్ 9 నాటికి కర్ణాటకలో మొత్తం 4,51,61,393 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,24,03,422 మంది పురుషులు, 2,27,55,113 మంది మహిళలు, 2,858 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీ అన్బుకుమార్ తెలిపారు.
కాగా, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ (సర్)లో భాగంగా 43,82,315 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. పంపిణీ అయిన నోటీసులలో 40,88,099 (93.47 శాతం) సంబంధించి విచారణలు పూర్తయ్యాయని, 2,85,646 నోటీసులకు సంబంధించిన ప్రక్రియ ఇంకా పెండింగ్‌లో ఉన్నదని ఎన్నికల ప్రధాన అధికారి పేర్కొన్నారు. చివరి విచారణ అక్టోబర్ 12న జరుగుతుందని వివరించారు.
మరోవైపు ఓటర్ల జాబితాలో పేర్లు చేరిక లేదా తొలగింపు ప్రతిపాదనలపై అభ్యంతరాలను తెలియజేసే ‘ఫారం-7’ దరఖాస్తులు 1,10,654 అందాయని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) కార్యాలయం శుక్రవారం తెలిపింది. పెద్ద సంఖ్యలో ‘ఫారం-7’ దరఖాస్తులు సమర్పించడంపై దృష్టిసారించినట్లు పేర్కొంది.
అయితే ఈ దరఖాస్తుల్లో చాలా వరకు తప్పుడు ఉద్దేశంతో సమర్పించినట్లుగా ఆరోపణలు వచ్చాయని సీఈసీ అన్బుకుమార్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు డిక్లరేషన్లు చేసినట్లు తేలిన దరఖాస్తుదారులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే అభ్యర్థనలు, అభ్యంతరాలను పరిష్కరించడానికి అక్టోబర్ 22 తుది గడువు కాగా, ఈసీ షెడ్యూల్ ప్రకారం కర్ణాటకలో తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 27న విడుదలవుతుందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Srikanth Odela | ఒక్క ఫ్లాప్‌తో శ్రీకాంత్ ఓదెలపై నెగెటివ్ ప్రచారం.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

