న్యూఢిల్లీ: కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రకటించిన సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిధుల కేటాయింపులో దక్షిణ రాష్ర్టాలపై కేంద్రం పూర్తి వివక్ష చూపిందని మండిపడిన ఆయన ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణ భారత్కు ప్రత్యేక దేశం ఇవ్వాలని అన్నారు.
‘దక్షిణ భారత దేశానికి బడ్జెట్లో అన్యాయం జరిగింది. దక్షిణాది రాష్ర్టాలకు రావాల్సిన నిధులు ఉత్తర ప్రాంతాలకు తరలిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు. దక్షిణ ప్రాంతంపై హిందీ ప్రాంతవాసులు చూపుతున్న వివక్ష కారణంగా వేరే గతి లేక ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.