Watch: రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న తల్లి, కుమారుడు
ఎదురుగా ఉన్న ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు ఇది చూసి చాలా ఆందోళన చెందారు. అయితే తల్లి, కుమారుడు క్షేమంగా బయటపడటంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
బెంగళూరు: తల్లి, కుమారుడు రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రైలు పట్టాలు దాటుతుండగా రైలు వస్తుండాన్ని గమనించారు. ఫ్లాట్‌ఫామ్ కింద గొడ అంచున ఉండిపోయారు. రైలు వెళ్లిన తర్వాత ఫ్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని కాలబుర్గిలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి ఒక మహిళ తన కుమారుడితో కలిసి కాలబుర్గి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. రైలు పట్టాలు దాటుతూ ఒక ఫ్లామ్‌ఫామ్ నుంచి మరో ఫ్లాట్‌ఫామ్ వద్దకు వెళ్లేందుకు వారు ప్రయత్నించారు.
కాగా తల్లి, కుమారుడు మరో ఫ్లాట్‌ఫామ్ వద్దకు చేరుకున్నారు. అయితే పైకి ఎక్కేలోగా ఒక గూడ్స్ రైలు వేగంగా ఆ పట్టాలపై వస్తున్నది. గమనించిన వెంటనే వారిద్దరూ ఫ్లాట్‌ఫామ్ కింద గోడ అంచులో కూర్చొని ఉండిపోయారు. భయపడిన కుమారుడు తల్లిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ గూడ్స్ రైలు వెళ్లిన తర్వాత వారిద్దరూ పైకి లేచి ఫ్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు. అదృష్టవశాత్తు ఆ మహిళ, ఆమె కుమారుడికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
మరోవైపు ఎదురుగా ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు ఇది చూసి చాలా ఆందోళన చెందారు. అయితే తల్లి, కుమారుడు క్షేమంగా బయటపడటంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH: Mother, son miraculously escape unhurt as speeding train passes over them in Karnataka#Karnataka #India #ViralVideo #Viral #Shocking #Train #IndianRailway #Railway #railwayTracks pic.twitter.com/BoFeC7eyHI
— Free Press Journal (@fpjindia) December 8, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

