రామనగర: కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి(Kumaraswamy)ని నల్లవాడు అంటూ వర్ణవివక్ష వ్యాఖ్యలు చేశారు కర్నాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్. నలుపు రంగులో ఉన్న కుమారస్వామిని కాలియా అంటూ మంత్రి జమీర్ విమర్శించారు. వర్ణవివక్ష వ్యాఖ్యలు చేసిన జమీర్‌ను క్యాబినెట్ నుంచి తొలగించాలని జేడీఎస్ డిమాండ్ చేసింది. అయితే కుమారస్వామిని బాధపెట్టాలన్న ఉద్దేశంత తనకు లేదని ఖాన్ తెలిపారు. కుమారస్వామి తనను కుల్లా(పొట్టివాడు) అని పిలిచేవారని, అయితే ఆయన్ను కరియన్న(నల్ల సోదరుడు) అని పిలిచినట్లు మంత్రి జమీర్ వెల్లడించారు.
రామనగరలోని మైనార్టీలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. చన్నాపట్న కాంగ్రెస్ అభ్యర్థి సీపీ యోగేశ్వర్ ఓ దశలో బీజేపీలో చేరాలనుకున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విబేధాల వల్ల ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేశారని, బీజేపీలో చేరే ఆప్షన్ లేదని, జేడీఎస్‌లో కూడా చేరలేకపోయారని, ఎందుకంటే కాలియా కుమారస్వామి.. బీజేపీ కన్నా ప్రమాదకారి అని, ఇప్పుడు యోగేశ్వర్ మళ్లీ స్వంత గూటికి వచ్చినట్లు జమీర్ తెలిపారు. చెన్నాపట్న అసెంబ్లీ బై పోల్స్‌లో ఎన్డీఏ అభ్యర్థిగా కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్నారు.