సీఎం డీకేకు ఎదురుదెబ్బ.. సన్నిహితుడు రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా
పదవిని చేపట్టిన మూడు రోజులకే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రికి సన్నిహితుడైన మంత్రి రామలింగారెడ్డి శుక్రవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను కోరుకున్న మంత్రిత్వ శాఖను కేటాయించ లేదన్న అసంతృప్తితో ఆయన పదవికి రాజీనామా చేశారు.
- శాఖ కేటాయింపుపై అసంతృప్తి
- మంత్రి మునియప్ప కూడా అలక
- కర్ణాటక కాంగ్రెస్‌లో గడబిడ
బెంగళూరు, జూన్ 5 : పదవిని చేపట్టిన మూడు రోజులకే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రికి సన్నిహితుడైన మంత్రి రామలింగారెడ్డి శుక్రవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను కోరుకున్న మంత్రిత్వ శాఖను కేటాయించ లేదన్న అసంతృప్తితో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఆయన బెంగళూరు అభివృద్ధి శాఖను కోరగా, జల వనరుల శాఖను అప్పగించారు. దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన ఆయన తాను పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. మంత్రి పదవికే రాజీనామా చేశా తప్ప కాంగ్రెస్ పార్టీకి కాదని ఆయన మీడియాకు స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే ఆ శాఖను తనకు అప్పగిస్తానని శివకుమార్ రెండుసార్లు తనకు వాగ్దానం చేశారన్నారు.
తాను అడగకపోయినా డీకే తన ఇంటికి వచ్చి మరీ తనకు ఆ శాఖను కేటాయిస్తున్నట్టు తెలపగా, తాను సరేనని అన్నానని తెలిపారు. ఇప్పుడు సీఎం పిలిచి బెంగళూరు అభివృద్ధి శాఖను కేటాయించినా అంగీకరించ బోనని, ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు. మరోవైపు మునియప్ప కూడా తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఆయనకు ఆహార, ప్రజాపంపిణీ శాఖను కేటాయించారు. అయితే ఆయన సామాజిక సంక్షేమం లేదా వ్యవసాయ శాఖను కోరుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

