బెంగుళూరు: కర్నాటకలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో నలుగురు విద్యార్థులు బుర్కా ధరించి స్టేజ్‌పై బాలీవుడ్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. మంగుళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. డ్యాన్స్‌కు చెందిన వీడియో వైరల్ అయ్యింది. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్ ఆ నలుగురు అబ్బాయిలపై సస్పెన్షన్ విధించారు. ఘటన పట్ల విచారణ చేపట్టారు. ముస్లిం విద్యార్థులే బుర్కా ధరించి డ్యాన్స్ చేసినట్లు కాలేజీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొన్నది. అనుమతి తీసుకోకుండానే విద్యార్థలు అకస్మాత్తుగా డ్యాన్స్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.