Karnataka | కర్నాటక సీఎం సిద్ధరామయ్య సహా నలుగురికి జరిమానా విధించిన హైకోర్టు..!
Karnataka | కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేబినెట్ మంత్రులు ఎంబీ పాటిల్, రామలింగారెడ్డితో పాటు కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలాకు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10వేల జరిమానా విధించింది. నలుగురిని ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.
Karnataka | కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేబినెట్ మంత్రులు ఎంబీ పాటిల్, రామలింగారెడ్డితో పాటు కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలాకు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10వేల జరిమానా విధించింది. నలుగురిని ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. మార్చి 6న సీఎం సిద్ధ రామయ్య, 7న రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి, 11న కాంగ్రెస్ కర్నాటక ఇన్చార్జి రణదీప్ సూర్జేవాలా, 16న పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ కోర్టులో హాజరుకావాలని చెప్పింది. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో అప్పటి మంత్రి కేఎస్ ఈశ్వరప్పను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ 2022 ఏప్రిల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రస్తుత సీఎం సహా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బెలగావి వాసి కాగా.. ఆయన ఉడిపిలోని హోటల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, తాను చేసిన పనులకు ఈశ్వరప్ప కమిషన్ డిమాండ్ చేశారని ఆరోపించారు. అయితే, ఈశ్వరప్ప ఆరోపణలను తోసిపుచ్చడంతో పాటు ఆయనపై పరువు నష్టం కేసు నమోదు చేశారు. కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో మంత్రి రాజీనామా చేయాలని అప్పటి కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మై నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించా డీకే శివకుమార్‌తో సహా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

