యెడియూరప్ప రాజీనామాకు గవర్నర్ ఆమోదం..!
Yedyurappa Resignation: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప రాజీనామాకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. అయితే, తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప రాజీనామాకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. అయితే, తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేవరకు రాష్ట్రానికి కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని ఆయన సూచించారు. కర్ణాటకకు నాలుగోసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యెడియూరప్ప.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ్టికి సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.
ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉదయం గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. వెంటనే ఆయన యెడ్డీ రాజీనామాకు ఆమోదం తెలుపుతూ.. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేవరకు కేర్ టేకర్ బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. కాగా, బీజేపీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చర్చించి కొత్త ముఖ్యమంత్రిని ఖరారు చేసే అవకాశం ఉన్నదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం బీజేపీ అధిష్ఠానం త్వరలోనే కర్ణాటకకు పరిశీలకులను పంపనున్నారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

