Watch: కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా… క్రేన్ ఢీకొని యువతి మృతి
ఈ సంఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డు ఆక్రమణలు, క్రేన్ వంటి భారీ వాహనాలను అనుమతించడం, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వంటి సమస్యలపై గళమెత్తారు.
బెంగళూరు: కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఒక యువతిని క్రేన్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. దీంతో స్థానికులు నిరసనకు దిగారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. వైట్ఫీల్డ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల నూర్ పిజా, శుక్రవారం కాలేజీ విడిచిన తర్వాత నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నది. అయితే వెనుక వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన క్రేన్ ఆ యువతిని ఢీకొట్టింది. దాని కింద నలిగిపోయిన ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆ యువతిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డు ఆక్రమణలు, క్రేన్ వంటి భారీ వాహనాలను అనుమతించడం, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వంటి సమస్యలపై గళమెత్తారు. నూర్ పిజా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫ్లకార్డులతో శనివారం నిరసన తెలిపారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాద సంఘటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Warning: Disturbing visuals.
19-year-old succumbs to injuries after construction crane mows her down. Visuals of horrific incident in Bengaluru's Whitefield locality caught on camera. pic.twitter.com/MOW9YYUntl
— South First (@TheSouthfirst) November 5, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

