న్యూఢిల్లీ: తన సంపాదనతో స్కూల్ నిర్మించిన పండ్ల వ్యాపారికి పద్మశ్రీ అవార్డు లభించింది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన పండ్ల వ్యాపారి హరేకల హజబ్బకు పద్మశీ అవార్డును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం అందజేశారు. దీనిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తాను చదువుకోలేదని హరేకల హజబ్బ తెలిపారు. దీంతో తమ గ్రామంలోని ప్రతి చిన్నారి చదువుకోవాలన్న ఉద్దేశంతో తన సంపాదనతో పాఠశాలను నిర్మించినట్లు ఆయన చెప్పారు. ఆ స్కూల్లో ప్రస్తుతం 10వ తరగతి వరకు 175 మంది విద్యార్థులు చదువుతున్నారని హరేకల హాజబ్బ వివరించారు.