Kumaraswamy | అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం కుమారస్వామి
Kumaraswamy | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
Kumaraswamy | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం వైద్యులు కుమారస్వామికి ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయనకు ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులనుంచి ఆయన పలు మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలార్ జిల్లా పర్యటకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. తీరికలేని పని వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవలే కుమార స్వామికి గుండె సంబంధిత ఆపరేషన్ కూడా జరిగింది. దీంతో కుటుంసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు.
Also Read..
Praggnanandhaa | ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ చెప్పిన ప్రజ్ఞానంద.. ఎందుకంటే..?
Cabin Crew | విమానం రెక్కలపై నిల్చుని ఫొటోలకు ఫోజులిచ్చిన సిబ్బంది.. వీడియో
Putin | అరెస్ట్ వారెంట్ తర్వాత.. తొలిసారి దేశ సరిహద్దులు దాటనున్న పుతిన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

