బెంగుళూరు: కర్నాటక(Karnataka)లో డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ రామచంద్రరావుకు చెందిన రాసలీలల వీడియో వైరల్ అవుతున్నది. ఇప్పటికే ఆయన అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆయన కుమార్తె రన్యారావుపై దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆఫీసు ఛాంబర్లో ఓ మహిళతో సరసం ఆడుతున్న దృశ్యాలకు చెందిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. ఓసారి యూనిఫామ్ వేసుకుని, సివిల్ దుస్తుల్లో మరోసారి.. వేర్వేరు మహిళలను హత్తుకుంటూ, కిస్ ఇస్తూ డీజీపీ రామచంద్రరావు ఆ వీడియోలో కనిపించారు.
ఆఫీసు వేళల్లో ఆయన రాసలీలలు ఆడడం అభ్యంతరకరంగా మారింది. డీజీపీ ఆఫీసులోనే ఆ వీడియోను చాలా సీక్రెట్‌గా రికార్డింగ్ చేశారు. కనీసం అయిదారు నెలల క్రితం ఆ వీడియో తీసినట్లు అనుమానిస్తున్నారు. అయితే కర్నాటక గవర్నమెంట్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఇంకా తెలియడం లేదు. ఆ వీడియో ఘటన పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆఫీసర్ నుంచి సీఎం వివరణ కోరారు.
తానేమీ తప్పు చేయలేదని ఆ డీజీపీ అన్నారు. ఈ రోజుల్లో ఏదైనా సాధ్యమే అని, తన లాయర్లతో మాట్లాడిన తర్వాత దీని గురించి వెల్లడిస్తానని డీజీపీ రామచంద్ర రావు తెలిపారు. అది మార్ఫింగ్ చేసిన వీడియో అని, నన్ను టార్గెట్ చేశారన్నారు.
ಡಿಜಿಪಿ ರಾಮಚಂದ್ರ ರಾವ್ ರಾಸಲೀಲೆ ವಿಡಿಯೋ ವೈರಲ್!#DGP #RamachandraRao #videoviral #KannadaNews #navasamajanews pic.twitter.com/31cuSQWxnp
— navasamaja (@navasamajanews) January 19, 2026
రన్యారావు గోల్డ్ స్మిగ్లింగ్ కేసు సమయంలో 1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావును బలవంతంగా లీవ్‌పై పంపారు. కేసు దర్యాప్తులో పారదర్శకత కోసం ఆ చర్య తీసుకున్నట్లు అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. 2025 ఆగస్టులో ప్రభుత్వం ఆ లీవ్‌ను విత్‌డ్రా చేసింది. మళ్లీ డీజీపీగా నియమించింది.