బెంగళూరు: కాంగ్రెస్ నేత కుమారుడు కారును వేగంగా నడిపాడు. ఒక బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. (Congress leader’s son crushes biker) తీవ్రంగా గాయపడిన ఆ బైకర్ చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కాంగ్రెస్ నేత కుమారుడ్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ వెంటనే అతడు బెయిల్ పొందాడు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెలపు గ్రామానికి చెందిన దేవీ ప్రసాద్ శెట్టి ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. నవంబర్ 13న తెల్లవారుజామున ఆయన కుమారుడు ప్రజ్వల్ శెట్టి, ఎస్‌యూవీని వేగంగా నడిపాడు. బైక్‌పై వెళ్తున్న 39 ఏళ్ల మహమ్మద్ హుస్సేన్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
కాగా, శిర్వా పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెన్ నేత దేవీ ప్రసాద్ శెట్టి కుమారుడైన ప్రజ్వల్‌ను నవంబర్ 14న అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో హాజరుపర్చగా అదే రోజున అతడు బెయిల్ పొందాడు. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.