Muda Case | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సుప్రీంకోర్టు అనంతరం బెంగళూరు ప్రత్యేక కోర్టు సైతం విచారణకు ఆదేశించింది. ముడా కేసులో సీఎంపై విచారణకు కర్ణాటక లోకాయుక్త ఆదేశించింది. సామాజిక కార్యకర్త అయిన పిటిషన్ స్నేహమయి కృష్ణ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ప్రైవేటు పిటిషన్ వేశారు. ఆశ్రయించారు. దాంతో కోర్టు విచారణకు ఆదేశించింది. లోకాయుక్త ముడా కుంభకోణంపై విచారణ జరిపి మూడునెలల్లో నివేదిక సమర్పించనున్నారు. పిటిషన్ కృష్ణ తరఫున న్యాయవాది లక్ష్మీ అయ్యంగార్ విలేకరులతో మాట్లాడుతూ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. లోకాయుక్త విచారణ మొదలయ్యే వరకు వేచి ఉండాలన్నారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ ప్రారంభిస్తారేమో వేచి చూడాలన్నారు.
విచారణ నిస్పక్షికంగా జరుపకోపేతే కేసు విచారణను బదిలీ చేయాలని కోర్టును ఆశ్రయిస్తామన్నారు. మరో న్యాయవాది మాట్లాడుతూ కోర్టు ఆదేశం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. మైసూర్ లోకాయుక్త పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుగుతుందన్నారు. లోకాయుక్త పారదర్శకంగా దర్యాప్తు చేసేందుకు సీఎం రాజీనామా చేయాలన్నారు. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 14 స్థలాలను చట్టవిరుద్ధంగా ముడా కేటాయించిందని ఆరోపణలున్నాయి. తనపై విచారణకు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును పిటిషనర్ స్నేహమయి కృష్ణ ఆశ్రయించగా.. ఈ మేరకు న్యాయమూర్తి విచారణకు ఆదేశించారు.