Karnataka: కర్నాటకలో ప్రబలుతున్న అతిసారవ్యాధి.. వాటర్ టెస్టింగ్‌కు సీఎం ఆదేశాలు
Karnataka: కర్నాటకలో ప్రస్తుతం నీటి కొరత ఉన్నది. దీంతో అక్కడ కలరా వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు వాటర్ టెస్టింగ్ చేయాలని సీఎం సిద్ధరామయ్య జిల్లా అధికారులను ఆదేశించారు.
బెంగుళూరు: కర్నాటక(Karnataka)లో ప్రస్తుతం నీటి కొరత ఉన్నది. దీంతో అక్కడ కలరా వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు వాటర్ టెస్టింగ్ చేయాలని సీఎం సిద్ధరామయ్య జిల్లా అధికారులను ఆదేశించారు. కలుషిత నీటి వల్ల అతిసార, ఇతర రకాల వ్యాధులు వ్యాపిస్తుంటాయి. మైసూరు జిల్లాలో తాజాగా ఓ వ్యక్తి కలుషిత నీటిని సేవించడం వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడు. వరుణ నియోజకవర్గం, చాముండేశ్వరి సెగ్మెంట్లలో కలరా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.
డిప్యూటీ కమీషనర్లు, జిల్లా పంచాయతీ సీఈవోలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆదేశించారు. ప్రజలకు సురక్షితమైన మంచి నీటిని, తాగు నీటిని అందించాలని జిల్లా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ కమీషనర్లు తగిన చర్యలు తీసుకుని నీటిని ఎప్పటికప్పుడు టెస్టింగ్ చేయాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. గ్రామం ఎంత పెద్దగా ఉన్నా.. ప్రతి రోజు తాగునీటిని పరీక్షించాలన్నారు. ఎటువంటి నిర్లక్ష్యం జరిగినా జిల్లా అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. ఎక్కడ కేసులు నమోదు అయినా అక్కడ అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. వారిని సస్పెండ్ చేస్తామన్నారు. మైసూరు ఘటనలో అధికారులు నిర్లక్ష్యం ఉందని, వాటర్‌ను టెస్టింగ్ చేయకుండా విడుదల చేయడం సరికాదు అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

