కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకుగాను అధికారంలోకి రావాలంటే 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవాల్సి ఉండగా.. కాంగ్రెస్ ఏకంగా 135 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అయితే ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించి సునాయాస విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్థిని ఖరారు చేయడం తలకుమించిన ప్రయాసగా మారింది. పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవికి పోటీ పడుతుండటంతో ఇద్దరిలో ఎవరినీ ఖరారు చేయలేక తర్జనభర్జనలు పడుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధూ, డీకే ఇద్దరి బలాలు, బలహీనతలు, అవకాశాలు, పొంచివున్న ముప్పులపై స్పెషల్ ఫోకస్ పాఠకుల కోసం..
మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి సీఎం పదవిని దక్కించుకునేందు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే తన మద్దతుదారులైన రాష్ట్ర నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అనంతరం పార్టీ హైకమాండ్‌తో మాట్లాడేందుకు ఇవాళ ఉదయం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరి సిద్ధరామయ్య ప్రయత్నాలు ఫలిస్తాయా..? ఆయన బలాలు ఏమిటి.. బలహీనతలు ఏమిటి..? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
డీకే శివకుమార్ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేయడంతో ఎంతో కృషిచేశారు. తీవ్రంగా శ్రమించి పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించారు. అయితే ఇప్పటికే ఒకసారి పూర్తికాలం ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు మద్దతు సిద్ధరామయ్యకు ప్రధాన బలాలుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సిద్ధారామయ్య ఢీకొట్టి డీకే సీఎం సీఎం పదవిని తెచ్చుకోగలడా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో డీకే బలాబలాల గురించి ఒకసారి చర్చిద్దాం..