మైసూరు: కర్నాటకలోని మైసూరులో చర్చిని ధ్వంసం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. ఆ చర్చిలో ఉన్న బేబీ జీసెస్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రిస్మస్ ముగిసిన రెండు రోజుల వ్యవధిలోనే మైసూరులోని పెరియాపట్నాలో ఉన్న సెయింట్ మేరీస్ చర్చిని ధ్వంసం చేశారు.
పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడి కోసం వెతుకుతున్నారు. వెనుక గేటును బ్రేక్ చేసి చర్చిలోకి దుండగులు ప్రవేశించినట్లు పోలీసులు వెల్లడించారు.
చర్చిలో ఉన్న డబ్బుల్ని దొంగలించేందుకు దానిపై దాడి చేసినట్లు తెలుస్తోందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కలెక్షన్ బాక్సును కూడా దుండగులు ఎత్తుకెళ్లారని మైసూరు ఎస్పీ సీమా లట్కార్ తెలిపారు.