బెంగళూరు, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం 24 మందితో మంత్రి వర్గాన్ని విస్తరించారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 34కు పెరిగింది. శనివారం రాజభవన్లో గవర్నర్ తావర్ చంద్ కొత్త మంత్రులతో ప్రమా ణం చేయించారు. మంత్రివర్గంలో కులాలు, ప్రాంతాల మధ్య సమతూకం దెబ్బ తినకుండా జాగ్రత్త వహించారు. మంత్రి వర్గంలో ఒక మహిళకు(లక్ష్మి హెబ్బాళ్కర్) మాత్రమే స్థానం దక్కింది. తెలుగు వ్యక్తి అయిన ఎన్.ఎస్.బోస్ రాజ్‌కు మంత్రి వర్గంలో స్థానం దక్కింది.