బెంగుళూరు: ఓ పిల్లోడు డేర్‌డెవిల్ స్టంట్ చేశాడు. ఓ కొండచిలువను ఈజీగా పట్టుకున్నాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. కర్నాటకలోని సాలిగ్రామలో ఈ ఘటన జరిగింది. ఓ భారీ కొండచిలువ(Giant Python) ఓ గ్రామంలోకి ప్రవేశించింది. అక్కడ ఓ వ్యక్తి ఆ కొండచిలువ తోక భాగాన్ని పట్టుకున్నాడు. కానీ ఆ కొండచిలువ చెట్లల్లోకి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఓ చిన్న పిల్లోడు ధైర్యసాహసాల్ని ప్రదర్శించాడు. ఆ కొండచిలువ మూతి భాగాన్ని తన చేతులతో డేరింగ్‌గా పట్టేశాడు. ఆ తర్వాత ఆ పామును బ్యాగులో వేశారు. ఈ వీడియోను దుర్గప్రసాద్ హెగ్డే తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశాడు.
Daredevil act at Saligrama #Kundapura
Heroic act by this child but it’s very dangerous too…….🐍 pic.twitter.com/EJm09wXPpX
— Dr Durgaprasad Hegde (@DpHegde) November 22, 2023