బెంగుళూరు: కర్నాటక ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఫుడ్ కలరింగ్ ఏజెంట్ రోడమైన్-బీ(Rhodamine-B)ను ఆ రాష్ట్రం బ్యాన్ చేసింది. ఈ కలరింగ్ ఏజెంట్‌ను పీచు మిఠాయి(కాటన్ క్యాండీ), గోబీ మంచురియ తయారీకి ఎక్కువగా వాడుతుంటారు. ఫుడ్ ఐటమ్స్‌పై ఎక్కువగా అడిటివ్స్ కలుస్తున్నాయని ఆరోపణలు వస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెలలోనే తమిళనాడు సర్కార్ కూడా కాటన్ క్యాండీ, ఫుడ్ ఐటమ్స్ కోసం వాడే కలర్స్‌ను నిషేధించింది. టెక్స్‌టైల్స్‌లో డై కోసం వాడే రోడమైన్ బీ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇటీవల నార్త్ గోవాలో కూడా బ్యాన్ చేశారు. రోడ్డు వైపుల అమ్మే గోబి మంచూరియ ఐటమ్స్ కోసం రోడమైన్ను నిషేధించారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అమ్మే వంటకాలను నిషేధించారు. గోబి మంచురియ కోసం సింథటిక్ కలర్స్ వాడడం ప్రమాదకరమవుతోందని మిశాల్ తెలిపారు.