చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్ ఉగాది సందర్భంగా చేసిన పోస్ట్‌పై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం స్టాలిన్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో తెలుగు, కన్నడ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ పోస్ట్‌లో ఆయన కన్నడిగులను ద్రవిడులుగా పేర్కొనటం వివాదానికి దారితీసింది. కన్నడ ప్రజలను ద్రవిడులుగా సంబోధించటంపై కొంతమంది కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీతో కలిసి పోరాడేందుకు కన్నడిగులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ. కన్నడ ద్రవిడ భాష కాదు. అది గుర్తుపెట్టుకోండి’ అని కొందరు కన్నడిగులు కామెంట్స్ పెట్టారు.