Ranya Rao : ఇటీవల కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లోని కెంపెగౌడ (Kempe Gouda) అంతర్జాతీయ విమనాశ్రయం (International Airport) లో వెలుగులోకి వచ్చిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు (Gold smuggling case) లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఏకంగా 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి (Kannada actress) రన్యారావు (Ranya Rao) ను డీఆర్ఐ (DRI) అధికారులు విచారిస్తున్నారు. ఆమెకు ఆర్థిక నేరాల న్యాయస్థానం విధించిన మూడు రోజుల డీఆర్ఐ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో అధికారులు మళ్లీ కోర్టులో హాజరుపర్చారు.
దాంతో కోర్టు ఆమెకు రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మార్చి 24 వరకు ఆమె జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది. కాగా ఇటీవల దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని బెంగళూరుకు తీసుకురాగా విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆమె విమానాశ్రయం నుంచి కొన్ని క్షణాల్లో బయటపడుతుందనగా అధికారులు అనుమానంతో తనిఖీ చేశారు. ఆమె నడుముకు పెట్టుకున్న బెల్టులో ఏకంగా 14.2 కిలోల బంగారం దొరికింది.
ఈ కేసును ఆదివారం సీబీఐ టేకోవర్ చేసింది. ప్రస్తుతం సీబీఐ అధికారులు కూడా నిందితురాలు రన్యారావును విచారిస్తున్నారు. కాగా రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వెనుక కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ హస్తం ఉన్నదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తున్నది. ప్రతిపక్ష బీజేపీనే రన్యారావుకు అండగా ఉన్నదని, బీజేపీ హయాంలో ఆమెకు ప్రభుత్వ భూమి కేటాయించడమే అందుకు నిదర్శనమని కాంగ్రెస్ ప్రత్యారోపణ చేస్తున్నది.
#UPDATE | Kannada actor Ranya Rao sent to judicial custody till 24th March in alleged gold smuggling case. https://t.co/ZQqlLMYV6o
— ANI (@ANI) March 10, 2025