బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటి రన్యారావు, తరుణ్ కొందూరు రాజ్‌లకు ప్రత్యేక కోర్టు మంగళవారం డీఫాల్ట్ బెయిల్ మంజూరుచేసింది. వారిద్దరు చట్టబద్ధమైన బెయిల్‌కు అర్హులేనని, ఇద్దరు వ్యక్తుల నుంచి వ్యక్తిగత పూచికత్తు, ఒక్కొక్కరు రూ.2 లక్షల వ్యక్తిగత బాండ్‌ను సమర్పించిన తర్వాత వారిని బెయిల్‌పై విడుదల చేయాలని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.
విచారణ జరిగే అన్ని తేదీల్లో కోర్టు ముందు హాజరు కావాలని, దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరించాలని, కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతులు విధించింది.