బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్ తూగుదీపను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి బళ్లారి జైలుకు గురువారం తరలించారు. రేణుక స్వామి హత్య కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. పరప్పన అగ్రహార జైలులో ఆయన ఓ రౌడీ షీటర్తోపాటు మరో ముగ్గురితో ఆనందంగా గడుపుతున్నట్టు ఓ ఫొటో ఆదివారం బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఆయనను బళ్లారి జైలుకు తరలించేందుకు 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది.