పశ్చిమ బెంగాల్లో కంగారుల సంచారం… ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై దర్యాప్తు
కోల్‌కతా: సాధారణంగా ఆస్ట్రేలియాలో కనిపించే కంగారులు పశ్చిమ బెంగాల్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో వీటిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆస్ట్రేలియా, టాస్మానియా, న్యూ గినియాలో తప్ప ప్రపంచంలో మరే దేశంలో కంగారులు కనిపించవు. అయితే పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గురి జిల్లాలో రోడ్లపై వీటిని చూసి స్థానికులు నోరెళ్లబెట్టారు. వాటి సహజ ప్రాంతాల నుంచి ఇక్కడకు ఎలా వచ్చాయన్నది ఎవరికీ అర్థం కాలేదు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పశ్చిమ బెంగాల్ అటవీశాఖ అధికారులు మూడు కంగారులను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. జల్పాయ్గురి జిల్లాలోని గజోల్డోబా ప్రాంతంలో రెండు, సిలిగురిలో ఒక కంగారును కాపాడినట్లు బైకుంత్పూర్ ఫారెస్ట్ డివిజన్ రేంజర్ సంజయ్ దత్ తెలిపారు. చనిపోయిన మరో కంగారును గుర్తించినట్లు చెప్పారు. కంగారుల శరీరాలపై గాయాలున్నాయని అన్నారు. దీంతో చికిత్స కోసం బెంగాల్ సఫారీ పార్క్‌కు తరలించినట్లు వివరించారు. డీల్ కుదరకపోవడంతో స్మగ్లర్లు వీటిని అటవీ ప్రాంతంలో వదిలేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కాగా, పశ్చిమ బెంగాల్లో రోడ్లపై కనిపించిన కంగారుల ఫొటోలు, వీడియోలు తీసిన కొందరు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి వైరల్ అయ్యాయి. మన దేశంలోని జూకు చెందినవి కావని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఎవరో వీటిని నేపాల్‌కు స్మగ్లింగ్ చేయబోయి ఈ ప్రాంతంలో విడిచిపెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
Got this on WhatsApp. It looks like fled away from Zoo…anyone know the reality@IndiAves @ParveenKaswan pic.twitter.com/4WWWYwPVVQ
— Sudhakar Kumar (@MyPicsSpeaks) April 2, 2022
WB | Forest officials rescued two Kangaroos near Gajoldoba in Jalpaiguri.
The kangaroos had some serious injuries on their bodies & have been sent to Bengal Safari Park for further treatment. A team has been formed to probe the matter: S Dutta, RO, Belakoba Forest Range (01.04) pic.twitter.com/kT40YmyDmq
— ANI (@ANI) April 1, 2022
Here's a video.
Just look at the poor, distraught animals who are clearly in a state of shock.pic.twitter.com/eVEceWGAHP— Soumyadipta (@Soumyadipta) April 2, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

