ముంబై: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. తన ట్విటర్లో రాబోయే కాలానికి అంచనాలు అంటూ అతడు చేసిన ట్వీట్లు పెను దుమారం రేపుతున్నాయి. రాజకీయాలు, సినిమాలపై కేఆర్కే వరుస ట్వీట్లు చేస్తున్నాడు. శనివారం సాయంత్రం నుంచి తన ప్రెడిక్షన్స్ అంటూ ఆ ట్వీట్లలో కొన్ని అంచనాలు వేశాడతడు.
హిందూ, ముస్లిం గొడవలు
ఇందులో తొలి అంచనాగా సైఫ్, కరీనాఇద్దరు కొడుకులు వాళ్ల పేర్ల కారణంగా పెద్ద నటులు కాలేరని కేఆర్కే అన్నాడు. ఇక రెండో ప్రెడిక్షన్ అంటూ రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారు కానీ.. సోనియాగాంధీ చనిపోయిన తర్వాతే అంటూ మరో ట్వీట్ చేశాడు. వచ్చే పదేళ్లలో ప్రియాంకా చోప్రాకు భర్త నిక్ జొనాస్ విడాకులు ఇస్తాడంటూ మరొకటి.. ఒక నటుడు పెద్ద స్టార్ అవుతాడు కానీ.. అతని తండ్రి చనిపోయిన తర్వాతే అని మరో ట్వీట్ చేశాడు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పటికీ పెళ్లి చేసుకోదు అని కూడా కేఆర్కే అంచనా వేశాడు. ఇక 2024 ఎన్నికలకు ముందు హిందూ, ముస్లింల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరగనున్నాయని కూడా కేఆర్కే చెప్పడం గమనార్హం. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి అంచనాలు వేస్తున్న కమల్ ఆర్ ఖాన్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
Prediction 02- #RahulGandhi will become PM of India but after death of #SoniaGandhi ji.
— KRK (@kamaalrkhan) July 10, 2021
Prediction 03- Nick Jonas will divorce #PriyankaChopra within next 10 years!
— KRK (@kamaalrkhan) July 10, 2021
Prediction 05- Big Hindu Muslim Bawaal will happen in the country before election 2024!
— KRK (@kamaalrkhan) July 10, 2021