నైనిటాల్: కైలాశ్ మానసరోవర్ యాత్రపై ద్రవ్య(కరెన్సీ) ఒడిదొడుకులు ప్రభావం చూపాయి. నిరుడుతో పోలిస్తే యాత్ర రుసుము 20 శాతం పెరిగి రూ.2.09 లక్షలుగా ఖరారైంది. అధికారులు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
టిబెట్ గుండా సాగే యాత్ర భాగంపై అమెరికా డాలర్ ప్రభావం చూపిందని.. ఆ ఖర్చును డాలర్ల రూపంలోనే వసూలు చేస్తామని వారు తెలిపారు. వీసా రుసుము, వైద్యం, బస, తదితర ఖర్చులు ఇందులో ఉంటాయన్నారు. భారత్లో సాగే యాత్ర ఖర్చు రూ.8 వేలు పెరిగి రూ.65 వేలకు చేరుకుందన్నారు. జూలై 4న ప్రారంభమయ్యే యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని యాత్రను నిర్వహించే కుమాన్ మండల్ వికాస్ నిగమ్ తెలిపింది.