కోల్‌కతా: ‘కచ్చా బాదాం’ పాటతో నెట్టింట రాత్రికి రాత్రి సెన్సేషన్‌గా మారిన భుబన్ బాద్యకార్ ప్రమాదం జరిగింది. కొత్తగా కొన్న వాహనాన్ని గోడకు ఢీకొట్టడంతో ఆయన ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి. బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని స్వగ్రామంలో ఈ ఘటన జరిగింది. పల్లీలు అమ్ముకొనే బాద్యకార్ పాటను ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. అది కాస్తా వైరల్ అయికూర్చుంది. ఆయన కచ్చా బాదాం పాటను రీమిక్స్ చేసిన మ్యూజిక్ కంపెనీ అతనికి పారితోషికం కింద రూ.3 లక్షలిచ్చింది.