Kabaddi player Murder | కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. తలుపు తట్టి హతుడి పేరెంట్స్‌కు విషయం చెప్పిన దుండగులు
Kabaddi player Murder | పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో ఓ యువ కబడ్డీ ప్లేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కబడ్డీ ప్లేయర్‌ను దారుణంగా హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని అతని ఇంటి ముందుకు తీసుకొచ్చి పడేశారు. పైగా అతని ఇంటి తలుపులు తట్టి తల్లిదండ్రులను నిద్ర లేపారు. మీ కొడుకును చంపేశామని చెప్పి అక్కడి నుంచి పారిపోయారు.
కపుర్తలా: పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో ఓ యువ కబడ్డీ ప్లేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కబడ్డీ ప్లేయర్‌ను దారుణంగా హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని అతని ఇంటి ముందుకు తీసుకొచ్చి పడేశారు. పైగా అతని ఇంటి తలుపులు తట్టి తల్లిదండ్రులను నిద్ర లేపారు. మీ కొడుకును చంపేశామని చెప్పి అక్కడి నుంచి పారిపోయారు. చాలా రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. కపుర్తలా జిల్లాకు చెందిన హర్దీప్సింగ్ (22) కబడ్డీ ఆటగాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని తీవ్రంగా కొట్టి చంపి.. మృతదేహాన్ని తీసుకొచ్చి అతడి ఇంటి ముందే పడేశారు. అంతటితో ఆగక హర్దీప్ పేరెంట్స్‌ను తలుపు తట్టి నిద్రలేపారు. తలుపు తీసి బయటికి వచ్చిన హర్దీప్ తండ్రికి నీ కొడుకును కొట్టి చంపేశాం అని చెప్పి పారిపోయారు.
దుండగులు వెళ్లిపోగానే తల్లిదండ్రులు, స్థానికులు కలిసి హర్దీప్ను బతికున్నాడేమోనని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. హర్దీప్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హర్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తితో హర్దీప్కు ఉన్న పాత గొడవలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

