గువాహటి: ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరుగుతున్న అష్టలక్ష్మి మహోత్సవ్ ఫ్యాషన్ షోలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయమంత్రి సుకాంత మజుందార్ ర్యాంప్‌వాక్ చేశారు.
8 ఈశాన్య రాష్ర్టాల సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక స్వరూపాన్ని ప్రదర్శించే ఈ అష్టలక్ష్మి మహోత్సవ్ పండుగను ప్రధాని మోదీ ఈ నెల 6న ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన ఫ్యాషన్ షోలో కేంద్రమంత్రులు ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.