సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్‌కుమార్ ప్రమాణం
సుప్రీంకోర్టులో మరో ఐదుగురు జడ్జీలు చేరారు. తెలుగు వ్యక్తి జస్టిస్ సంజయ్‌కుమార్‌తోపాటు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో సీజేఐ చంద్రచూడ్ సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు.
- మరో నలుగురు న్యాయమూర్తులు కూడా..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: సుప్రీంకోర్టులో మరో ఐదుగురు జడ్జీలు చేరారు. తెలుగు వ్యక్తి జస్టిస్ సంజయ్‌కుమార్‌తోపాటు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో సీజేఐ చంద్రచూడ్ సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 32కు చేరింది. పూర్తిస్థాయి భర్తీకి ఇంకా ఇద్దరిని నియమించాల్సి ఉంది. అయితే వీరి నియామకానికి కూడా ఇప్పటికే కొలీజియం సిఫార్సు చేసింది. దీనికి కేంద్రం ఇంకా ఆమోదం తెలుపలేదు.
విక్టోరియా గౌరి నియామకంపై వివాదం
మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది ఎల్సీ విక్టోరియా గౌరి నియామకాన్ని కేంద్రం ఆమోదించింది. అయితే ఈ నియామకంపై వివాదం నెలకొన్నది. విక్టోరియా గౌరికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయని, గతంలో ఆమె ముస్లింలు, క్రిస్టియన్లకు వ్వతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె నియామక సిఫారసును వెనక్కు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు గతంలో సుప్రీంకోర్టు కొలీజియంతో పాటు రాష్ట్రపతికి లేఖ రాశారు. కాగా, విక్టోరియా గౌరి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై మంగళవారం అత్యవసర విచారణకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ముందుగా శుక్రవారం విచారిస్తామని బెంచ్ పేర్కొనగా.. నియామకం అంశాన్ని సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ కోర్టు దృష్టికి తీసుకురావడంతో పిటిషన్‌ను మంగళవారానికి లిస్టింగ్ చేసింది. కాగా, విక్టోరియా గౌరితోపాటు 11 మంది న్యాయవాదులను వివిధ హైకోర్టుల అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

