వివాదాస్పద తీర్పులిచ్చి, వార్తల్లోకెక్కిన జస్టిస్ పుష్ప గనేదివాలా శుక్రవారం రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె బాంబే హైకోర్టులో జస్టిస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె పదవీ కాలాన్ని పొడిగించేందుకు సుప్రీం కొలీజియమ్ సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. నేరుగా బాలిక శరీరాన్ని తాకనప్పుడు ఆ విషయం పోక్సో చట్టం కిందికి రాదని ఆమె ఓ కేసులో తీర్పును వెలువరించారు. బాలిక చేతు పట్టుకొని, జిప్ తెరిచినంత మాత్రాన దాన్ని కూడా పోక్సో కింద లైంగిక దాడిగా పరిగణించలేమని పుష్ప గనేదివాలా తీర్పు వెలువరించారు. ఇలాంటి వివాదాస్పద తీర్పులు వెలువరించడంతో సుప్రీం కోర్టు కొలీజియమ్ పదోన్నతి ఇవ్వడంలో విముఖత వ్యక్తం చేసింది. అయితే అదనపు న్యాయమూర్తి పదవీ కాలాన్ని మాత్రం ఏడాది పొడిగించారు. ఈ పదవీ కాలం కూడా శుక్రవారంతో ముగిసింది. ద