కోల్‌కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ చిత్తరంజన్ దాస్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వీడ్కోలు సందర్భంగా హైకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సభ్యుడినని చెప్పారు.
ఈ విషయం కొందరికి రుచించదని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ నేతలు పిలిస్తే మళ్లీ వెళ్లడానికి తాను సిద్ధమేనన్నారు. తాను చేయగలిగిన సహాయం లేదా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను బాల్యం నుంచి ఆరెస్సెస్‌లో ఉన్నానని, ధైర్యంగా, నిజాయితీగా ఉండటం; ఇతరులను సమానంగా చూడటం, అన్నిటికీ మించి దేశభక్తి, పని పట్ల నిబద్ధత వంటివాటిని తాను అక్కడ నేర్చుకున్నానని చెప్పారు.