న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి సుప్రీంకోర్టు జడ్జిగా సోమవారం నియమితులయ్యారు. ఆయనకు పదోన్నతి కల్పించాలని ఈ నెల 6న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
ఆయన నియామకాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బాగ్చి పదవీ కాలం ఆరు సంవత్సరాలు. భారత ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేసే అవకాశం ఆయనకు వస్తుంది.