రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చంపయీ సొరేన్ శుక్రవారం బీజేపీలో చేరారు. రెండు రోజుల క్రితమే జేఎంఎం పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. పలువురు నేతలు, మద్దతుదారులతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చంపయీ చేరికతో గిరిజన వర్గాల్లో తమ పార్టీకి పట్టు లభిస్తుందని, ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుతుందని కమలం పార్టీ భావిస్తున్నది.