జమ్ము, డిసెంబర్ 21: వరుస హత్యల నేపథ్యంలో తమను లోయ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాలని నిరసన చేపడుతున్న కశ్మీరీ పండిట్లకు ఎల్జీ మనోజ్ సిన్హా హెచ్చరికలు చేశారు. వారికి వేతనాలు ఇవ్వబోమని స్పష్టంచేశారు. బుధవారం విలేకరలతో మాట్లాడుతూ ‘కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా జరుగుతున్న హత్యల గురించి ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తున్నది. కాబట్టి పండిట్లు ఇకనైనా నిరసనకు స్వస్తి పలికి విధులకు హాజరుకావాలి. విధులకు హాజరుకాకుండా ఇంటి వద్దే ఉంటామంటే కుదరదు. ఇలాంటి వారికి జీతాలు ఇవ్వం’ అని పేర్కొన్నారు. కాగా లోయ ప్రాంతం నుంచి తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలంటూ కశ్మీరీ పండిట్లు కొద్ది నెలల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.