న్యూఢిల్లీ, మే 27: దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. గత కొన్నేండ్లుగా మ్యూచువల్ ఫండ్ల వ్యాపారంలో అడుగుపెట్టడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయి. మ్యూచువల్ ఫండ్ వ్యాపార నిర్వహణకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
‘జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ నూతన వ్యాపారం జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థే కావడం విశేషం. అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్‌తో కలిసి జియో ఫైనాన్షియల్ ఈ సంస్థను ఏర్పాటు చేసింది.